Liked on YouTube: Basic of Raja Yoga in Telugu

Basic of Raja Yoga in Telugu
ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయము 1936వ సంవత్సరములో స్థాపించబడినది. ప్రపంచములో దిగజారుచున్న నైతిక ప్రమాణములను ఉద్దరించి, మూఢాచారములను, అంధ-విశ్వాసములను తొలగించి, సత్య జ్ఞానయోగముల ద్వారా మానవులను దివ్యగుణాలతో తీర్చిదిద్ది భారతదేశము మరియు ప్రపంచమును ఉద్దరించుట ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యము. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము కావున విశ్వ మానవులందరూ పరస్పరం సోదరులమని భావిస్తారు. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడుగా, సర్వసుఖ సంపన్నుడుగా ఉండేవాడు. కాలక్రమములో ఆత్మికశక్తి లోపించుట చేత దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపన్నతలకు దూరమవుతాడు. అనేక మత, కుల, వర్గ భేదములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరల ఇప్పుడు సనాతనమైన సహజ రాజయోగము, సత్యగీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వస్థితిని పొందగలదు. ఇది ఒక వినూతనమైన ఆధ్యాత్మిక క్రాంతి. సమాజ సేవ కోసం ఇక్కడ అందించే కోర్సులు ఉచితంగా ఇవ్వబడుతాయి. మీ సుఖవంతమైన జీతం కోసం, మరిన్ని వివరాలు కోసం మీ దగ్గరలో ఉన్న బ్రహ్మాకుమారీస్ సెంటర్ ద్వారా స్వయం గా పరమాత్మ నేర్పే బ్రహ్మాఙ్ఞానం పొందండి. ఓం శాంతి... సర్వేజన సుఖినోభవ... బ్రహ్మాకుమారీస్ సెంటర్స్ సెర్చ్ లింక్ క్రింద ఇవ్వబడింది. https://ift.tt/3iC8E7O
via YouTube https://www.youtube.com/watch?v=ZeLhKGNSWGk

No comments

Powered by Blogger.